కశ్మీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
- IndiaGlitz, [Wednesday,August 07 2019]
కశ్మీర్ అంశంపై ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరో కాదు.. పాకిస్థాన్ హీరోయిన్ మహీరా ఖాన్. ఈమె బాలీవుడ్లో షారూక్‌తో కలిసి 'రాయిస్' సినిమాలో నటించారు. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని కేందప్రభుత్వం తొలగించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ అమోదం కూడా లభించింది. దీనిపై భారతదేశంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం నిరసన వ్యక్తం అవుతుంది.
ఈ నేపథ్యంలో ''మేం పరిష్కరించడానికి ఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించింది. ప్రాణాలను కోల్పోవడం గురించి స్వర్గం మండుతోంది. మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం'' అంటూ మహీరా ఖాన్ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. 'మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందింది? దీనిపై మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదు?' అంటూ ఓ నెటిజన్ అంటే.. 'కాశ్మీర్ మాది. అందులో శాంతి కోసం మా ప్రభుత్వం తీసుకున్న చర్య ఇది. కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది' అంటూ మరొకరు అన్నారు.