కశ్మీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కశ్మీర్ అంశంపై ఓ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరో కాదు.. పాకిస్థాన్ హీరోయిన్ మహీరా ఖాన్. ఈమె బాలీవుడ్లో షారూక్‌తో కలిసి `రాయిస్` సినిమాలో నటించారు. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని కేందప్రభుత్వం తొలగించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ అమోదం కూడా లభించింది. దీనిపై భారతదేశంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం నిరసన వ్యక్తం అవుతుంది.
ఈ నేపథ్యంలో ``మేం పరిష్కరించడానికి ఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించింది. ప్రాణాలను కోల్పోవడం గురించి స్వర్గం మండుతోంది. మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం`` అంటూ మహీరా ఖాన్ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. `మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందింది? దీనిపై మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదు?` అంటూ ఓ నెటిజన్ అంటే.. `కాశ్మీర్ మాది. అందులో శాంతి కోసం మా ప్రభుత్వం తీసుకున్న చర్య ఇది. కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది` అంటూ మరొకరు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments