మరోసారి లక్ పరీక్షించుకుంటున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలనటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన షామిలి అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌గా తెలుగులో `ఓయ్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంద రంగ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడం, షామిలి కాస్తా బొద్దుగా కనపడటంతో అవకాశాలేమీ రాలేదు.
షామిలి తర్వాత మలయాళంలో ఓ సినిమా, తమిళంలో వీరశివాజీ అనే మరో సినిమా మాత్రమే చేసింది. కాగా ఇప్పుడు మరో షామిలి తన లక్‌ను తెలుగులో మళ్ళీ పరీక్షించుకోనుంది. నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలో షామిలి హీరోయిన్‌గా నటిస్తుంది. పవన్ సుందర్ దర్శకుడు. మరి ఈ సినిమాతో అయినా షామిలికి అదృష్టం కలిసొస్తుందంటారా? చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments