దీపం ఉండగానే చక్కబెట్టేస్తోంది....

  • IndiaGlitz, [Monday,July 31 2017]

మ‌ల‌యాళీ బ్యూటీ న‌య‌న‌తార క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ ఉంది. మూడు ప‌దులు దాటిన ఈ అమ్మడుకి అవ‌కాశాలు క్యూ క‌డుతూనే ఉన్నాయి. తెలుగులో ఇప్పుడు బాల‌కృష్ణతో స‌ర‌స‌న ఆయ‌న న‌టిస్తున్న 102వ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇప్ప‌టి హీరోయిన్స్ సినిమాల‌తోనే కాకుండా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ, షాప్స్ ఓపెనింగ్స్‌తో బాగానే కూడ‌బెట్టుకుంటున్నారు.

కానీ న‌య‌న‌తార ఇప్ప‌టి వ‌ర‌కు వీట‌న్నింటికి దూరంగా ఉంటుంది. కానీ రీసెంట్‌గా ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించ‌డ‌నికి ఒప్పుకుంది. ఈ ప్ర‌క‌ట‌నలో న‌టించ‌డానికి న‌య‌న‌తార పుచ్చుకుంటున్న మొత్తం ఎంతో తెలిస్తే నోరు తెర‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అక్ష‌రాల ఐదు కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని న‌య‌న‌తార చార్జ్ చేసింది. ఈ యాడ్ కోసం న‌య‌న‌తార కేటాయిస్తున్న స‌మ‌యం ఎంతో తెలుసా రెండు రోజుల మాత్ర‌మే. న‌య‌న‌తార ఊపు చూస్తున్న కొంద‌రేమో దీపం ఉండ‌గానే న‌య‌న‌తార చ‌క్క‌బెట్టుకుంటుందంటున్నారు.