మాస్‌రాజ‌కు నో చెప్పేసిన హీరోయిన్‌?

  • IndiaGlitz, [Sunday,June 07 2020]

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్(‘మ‌హ‌ర్షి’ సినిమాటోగ్రాఫ‌ర్‌) కుమార్తె మాళ‌వికా మోహ‌న‌న్ మలయాళ చిత్రంతో హీరోయినన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈమె క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లోనూ న‌టించింది. ఇక కోలీవుడ్ విష‌యానికి వ‌స్తే సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా న‌టించిన ‘పేట’ చిత్రంలో మాళ‌వికా మోహ‌న‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. త‌ర్వాత తెలుగులోనూ న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా స్టార్ట్ అయిన ‘హీరో’ సినిమాలో మాళ‌వికా మోహ‌న‌న్‌నే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఈ సినిమా బ‌డ్జెట్ ప‌రిమితులు దాటుతుండ‌టంతో నిర్మాత‌లు సినిమాను ఆపేశారు. ఇప్పుడు విజ‌య్ ‘మాస్ట‌ర్‌’ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మ‌రోసారి మాళ‌వికా మోహ‌న‌న్‌కు మ‌రో తెలుగు సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టింప చేయ‌డానికి మాళ‌వికా మోహ‌న‌న్‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించింద‌ట‌. అయితే ఎందుక‌నో మాళ‌విక తెలుగులో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేద‌ట‌.

More News

ఆర్ఆర్ఆర్‌లో శ్రియ‌... క‌న్‌ఫ‌ర్మ్ చేసిన న‌టి

ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రితో ఆడిపాడిన శ్రియా శ‌రన్ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది. అయితే ఈమ‌ధ్య ఈమె వ‌రుస సినిమాల్లో న‌టిస్తుంది.

రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ నూత‌న చిత్రం

ఈ మాయ పేరేమిటో, సూర్య‌కాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా

టీటీడీపై హీరో సూర్య తండ్రి సంచలన ఆరోపణలు.. కేసు నమోదు

తమిళ అగ్ర నటుడు సూర్య తండ్రి శివకుమార్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షాకిచ్చింది.

హైదరాబాద్‌లో ‘పది’ పరీక్షలో వాయిదా..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం..

కొత్త డైరెక్ట‌ర్‌తో యాంగ్రీ స్టార్‌

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి. తెలుగు సినిమాల్లో ఒక‌ప్పుడు ఉన్న క‌మ‌ర్షియాలిటీ త‌గ్గిపోతుంది. ఎమోష‌న్స్‌, రియ‌ల్ కంటెంట్ చుట్టూ సినిమా తిరుగుతుంది.