పాత్ర కోసం బరువు తగ్గుతున్న హీరోయిన్...
- IndiaGlitz, [Saturday,July 01 2017]
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నా జంటగా రూపొందిన 100% లవ్ సినిమా మంచి విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తన అసిస్టెంట్ చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో నిర్మించడానికి ప్లాన్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ చైతు స్థానంలో హీరోగా నటిస్తుంటే, తమన్నా స్థానంలో ఎవరు నటిస్తారని దానిపై చాలా డిస్కషన్స్ జరిగాయి.
అయితే ఇప్పుడు తమన్నా స్థానంలో నటించే హీరోయిన్స్ ప్లేస్‌లో చాలా ఇద్దరి ముగ్గురు పేర్లు వినిపించాయి. నిర్మాతలు తమన్నా స్థానంలో హెబ్బా పటేల్‌ను తీసుకుందామా లేక లావణ్య త్రిపాఠిని తీసుకుందామా అని ఆలోచించారు. చివరకు లావణ్యనే తమిళ రీమేక్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. తమిళ రీమేక్‌కు '100% కాదల్' అనే టైటిల్ పెట్టారు. కథ పరంగా హీరో హీరోయిన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాత్రలో కనిపించాలి కాబట్టి పాత్ర కోసం లావణ్య బరువు తగ్గుతుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.