మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేస‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌హేష్‌తో దేవి చేసిన 1 నేనొక్క‌డినే, శ్రీ‌మంతుడు చిత్రాలు మ్యూజిక‌ల్‌గా క్లిక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆ సినిమాల‌కు మించి మ్యూజిక‌ల్ హిట్ చేయ‌డానికి దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌య‌త్నిస్తున్నాడని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అందులో భాగంగా ప్ర‌ముఖ త‌మిళ క‌థానాయిక ఆండ్రియా చేత ఓ పాట పాడించాడ‌ట‌. క‌థానాయిక కాక ముందు ఆండ్రియా సింగ‌ర్‌గా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాఖీ సినిమాలో ఆమె పాడిన జ‌ర‌జ‌ర పాట బాగా పాపుల‌ర్ అయ్యింది.

More News

'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

'జంధ్యాల రాసిన ప్రేమకథ' సెన్సార్ పూర్తి, 24న విడుదల

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం.

న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్రాఫిట్ లో నాగ అన్వేష్ ఏంజిల్ చిత్రం

నాగ అన్వేష్,  హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన  'ఏంజెల్'.  ఈ చిత్రం నవంబర 3న  విడుదలై ఏంజెల్ చిత్రం ఆంధ్రా తెలంగాణ మొత్తం థియేటర్స్ కలిపి1st weak 80lacs షేర్ వచ్చింది.

ఆసక్తిని పెంచుతున్న...'ఖాకి' బ్యాక్గ్రౌండ్ స్కోర్!

సన్నివేశాల చిత్రీకరణ ఒక ఎత్తు. వాటికి సరైన నేపథ్య సంగీతం కుదరడం ఒక ఎత్తు. సన్నివేశంలోని బలాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారీ నేపథ్య సంగీతం దానికి ప్రాణం పోస్తుంది.