మహేష్ కోసం హీరోయిన్ పాట
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి సందర్భంగా ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్‌తో దేవి చేసిన 1 నేనొక్కడినే, శ్రీమంతుడు చిత్రాలు మ్యూజికల్‌గా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆ సినిమాలకు మించి మ్యూజికల్ హిట్ చేయడానికి దేవిశ్రీ ప్రసాద్ ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అందులో భాగంగా ప్రముఖ తమిళ కథానాయిక ఆండ్రియా చేత ఓ పాట పాడించాడట. కథానాయిక కాక ముందు ఆండ్రియా సింగర్‌గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాఖీ సినిమాలో ఆమె పాడిన జరజర పాట బాగా పాపులర్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com