నాకే దిక్కు లేదంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
రామన్ రాఘవ్, చెఫ్, కలాకండీ .. వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించిన శోభితా దూళ్ళిపాళ్ల తెలుగులో `గూఢచారి`లో నటించింది. ఇప్పుడు మిథున్, మెడిన్ హెవెన్, బర్డ్ ఆఫ్ బ్లడ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఓ చిత్రంలో ఈమె ముస్లిం అమ్మాయి పాత్ర చేస్తుంది. అందులో భాగంగా బుర్ఖాలో నటించి అలాగే హోటల్‌కి వెళ్లిందట. తన పేరిట రూం బుక్ చేశారని తాళాలు కావాలని అడిగితే సదరు హోటల్ వాళ్లు తాళాలు ఇవ్వలేదట.
``నేను నటిని అని రిసెప్షనిస్ట్‌కు తెలియదు. షూటింగ్ నుండి అలాగే రూమ్‌కు వెళ్లాను. తాళాలు అడిగితే ఇవ్వలేదు. నేను గొడవపడలేదు. అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయాను. నేను అనుకుని ఉండుంటే సారీ చెప్పించుకుని ఉండేదాన్ని అయితే చుట్టూ పక్కల ఉన్నవాళ్లలో మానవత్వం లేదు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. నేను ముస్లిం యువతినని అనుకుని నాతో ప్రవర్తించిన తీరు ఎంతో బాధ కలిగించింది. నా పరిస్థితే ఇలా ఉంటే.. ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ అలా చేయడం చాలా తప్పు`` అంటూ తన బాధను వెల్లగక్కింది శోభితా దూళ్ళిపాళ్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout