జడ్జ్ అమ్ముడుపోయారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
వరల్డ్ ఫేమస్ జంట ఏంజెలినా జోలీ.బ్రాడ్ పిట్ లు ఇక అధికారికంగా విడిపోనున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2016లోనే ఏంజెలినా జోలీ తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే పిల్లల సంరక్షణ ఎవరిది ? అనే ప్రశ్నతో ఇన్నేళ్ళుగా కేసు కొనసాగుతూనే ఉంది.
ఎట్టకేలకు కోర్టు ఈ కేసుకు ముగింపు పలకాలని డిసైడ్ అయింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ఏంజెలినా జోలికి వ్యతిరేకంగా ఉంది. ఇన్నేళ్ళుగా ఏంజెలినా పిల్లల సంరక్షణ భాద్యత తనకే ఇవ్వాలని పోరాడుతోంది. దీనికి వ్యతిరేకంగా బ్రాడ్ పిట్ కూడా వాదనలు వినిపించాడు. ఎట్టకేలకు కోర్టు తీర్పునిస్తూ.. పిల్లల సంరక్షణ కేవలం ఏంజెలీనాకే వదిలేయడం కుదరదని తేల్చింది.
ఇదీ చదవండి: స్టన్నింగ్ హాట్.. నడుము సొగసుతో మంత్రం వేస్తోంది
బ్రాడ్ పిట్ తో కలసి ఆమె పిల్లల సంరక్షణ చూసుకోవాలని ఆదేశించింది. తీర్పుపై ఏంజెలినా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాడ్ పిట్ కు అమ్ముడు పోవడం వల్లే జడ్జ్ ఇలాంటి తీర్పు ఇచ్చారని ఏంజెలినా దుయ్యబట్టింది.
బ్రాడ్ పిట్ తో ఇకపై తనకు ఎలాంటి సంబంధం ఉండకూడదని ఏంజెలినా కోరుకుంటోంది. కానీ పిల్లల విషయంలో మాత్రం ఆమె అతడితో ముందుకు సాగక తప్పడం లేదు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలనే ఆలోచనలో ఏంజెలినా ఉన్నట్లు సమాచారం.
తన గ్లామర్, నటనతో హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది ఏంజెలినా. 45 ఏళ్ల వయసులో కూడా వన్నె తరగని సొగసు ఆమె సొంతం. ఒకప్పుడు ఆమె హాలీవుడ్ లో టాప్ పైడ్ నటిగా రికార్డ్ సృష్టించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com