తల్లి పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Saturday,April 13 2019]
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించిన నటి సంగీత అందరికీ సుపరిచితురాలే. 2009లో క్రిష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈరోజు సంగీత తల్లి ఈమెపై మానవ హక్కుల కమీషన్‌కు పిర్యాదు చేశారు.
తన కుమార్తె, నటి సంగీత తనను ఇంటి నుండి వెళ్లిపోవాలని బలవంతం చేస్తోందని.. తాను కష్టపడి సంపాదించిన ఆస్థిని దోచేయడానికే సంగీతం అలా చేస్తుందని తమిళనాడు ఆమె తల్లి మానవ హక్కుల కమీషన్‌కు పిర్యాదు చేశారు. దీనిపై నటి సంగీత సోషల్ మీడియా వేదికగా పిర్యాదు చేశారు.
ప్రియమైన అమ్మ.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను పాఠశాలకు దూరం చేసి.. 13 ఏళ్ల నుండే పని చేయించినందుకు కృతజ్ఞతలు. నాతో ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయించినందుకు థాంక్స్. మద్యం, డ్రగ్స్‌కు బాని సై ఏ రోజూ పనికి వెళ్లని నీ కొడుకు కోసం నన్ను దోపిడీ చేసిందుకు థాంక్స్.
మన సొంత ఇంట్లోనే నీ నిర్ణయాలకు అడ్డురాకుండా ఓ మూల ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను పోరాడే వరకూ పెళ్లి చేయకుండా ఉన్నందుకు థాంక్స్. నా భర్తను నిరంతంర వేధిస్తూ నా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు.. ఓ తల్లి ఇలా ఉండకూడదని తెలియజేసిందుకు.. చివరిగా నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్.
తెలిసో, తెలియకో నన్ను నోరు లేని అమ్మాయి నుండి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావు. ఏదో ఒకరోజు నీ పొగరుని పక్కన పెట్టినప్పుడు నన్ను చూసి గర్వపడతావు అని తన ఎమోషన్స్‌ను ఓ లేఖలో తెలిపారు సంగీత.