బాలీవుడ్‌ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్

  • IndiaGlitz, [Saturday,September 19 2020]

తెలుగులో ఎన్టీఆర్‌ ఊసరవెళ్లి, మంచు మనోజ్‌తో పయనం సినిమాలు చేసిన హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో టాక్ ఆఫ్‌ ఇండస్ట్రీ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పాయల్‌ఘోష్‌ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇంతకూ పాయల్ ఘోష్‌ ఏం చెప్పింది. ఇంతకు ముందు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అమ్మడు ఓ ప్రముఖ దర్శకుడు తనను పక్క గదిలోకి తీసుకెళ్లాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఓరోజు అనురాగ్‌ నన్ను రమ్మంటే ఆయన్ని వెళ్లి కలిశాను. ఆయన ఆ సమయంలో తాగుతున్నాడు. గదిలో సీడీలు, పుస్తకాలున్నాయి. అక్కడున్న సోఫాలో ఇద్దరం కూర్చున్నాం. తను బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడనే లెగసీని ఎంజాయ్‌ చేస్తున్నానని, అమితాబ్‌బచ్చన్‌ తన కొడుకు అభిషేక్‌ కోసం సినిమా చేయమంటున్నాడని, కరణ్‌ జోహార్‌ తనకు ఫోన్‌ చేసి ప్రతి విషయాన్ని చెబుతుంటాడని అన్నారు. హీరోయిన్స్‌ హ్యూమా ఖురేషి, మహిగిల్‌, రిచా చద్దా తనకు ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటారని, ఫోన్‌ చేస్తే వెంటనే వచ్చి తను చెప్పిన పనిచేసి పోతారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో రిలేషన్‌ షిప్‌లో ఉండటం తప్పుకాదని, తనతో సన్నిహితంగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నాతో మాట్లాడుతూ నన్ను బలవంతం చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను శారీరకంగా మానసికంగా సన్నద్ధంగా లేను అని చెప్పి తప్పించుకున్నాను. ఈ విషయం జరిగి నాలుగైదేళ్లు అవుతున్నా.. బయటకు చెబుదామంటే వద్దని, నాపై యాసిడ్‌ దాడి జరుగుతుందని, నన్ను కిడ్నాప్‌ చేస్తారని, వదిలేయమని నా సన్నిహితులు చెప్పడంతో కామ్‌గా అయిపోయాను అన్నారు పాయల్‌ ఘోష్‌.