డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్
- IndiaGlitz, [Sunday,February 11 2018]
తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన ప్రయాణం కథానాయిక లావణ్య త్రిపాఠిది. 2006లో మిస్ ఉత్తరాఖండ్గా ప్రథమస్థానంలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత అందాల రాక్షసి' (2012)గా తెలుగు తెరకు పరిచయమైన లావణ్య.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం దూసుకెళ్తా', భలే భలే మగాడివోయ్', సోగ్గాడే చిన్ని నాయనా', శ్రీరస్తు శుభమస్తు' సినిమాల్లో నటించింది. కెరీర్‌ను నెమ్మదిగానే మొదలుపెట్టి వరుసగా ఒక్కొక్కటిగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది.
2012 నుంచి 2016 వరకు సక్సెస్‌ఫుల్‌గానే సాగిన ఈ భామ కెరీర్...2017 నుంచి ట్రాక్ తప్పింది. ఈ ఏడాదిలో మిస్టర్', రాధ', యుద్ధం శరణం', ఉన్నది ఒకటే జిందగీ', ప్రాజెక్ట్ z'.. ఇలా ఐదు వరుస పరాజయాలు దక్కాయి. కొత్త సంవత్సరంలో కూడా లావణ్యకి పరాజయాల పరంపర తప్పలేదు. ఈ శుక్రవారం విడుదలైన ఇంటిలిజెంట్' కూడా ఫ్లాప్ కావడంతో.. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది లావణ్య. మళ్ళీ ఈ హీరోయిన్ విజయాల బాట పడుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. ఈ ముద్దుగుమ్మ చేతిలో తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి.