డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన ప్రయాణం కథానాయిక లావణ్య త్రిపాఠిది. 2006లో మిస్ ఉత్తరాఖండ్గా ప్రథమస్థానంలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత అందాల రాక్షసి` (2012)గా తెలుగు తెరకు పరిచయమైన లావణ్య.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం దూసుకెళ్తా`, భలే భలే మగాడివోయ్`, సోగ్గాడే చిన్ని నాయనా`, శ్రీరస్తు శుభమస్తు` సినిమాల్లో నటించింది. కెరీర్‌ను నెమ్మదిగానే మొదలుపెట్టి వరుసగా ఒక్కొక్కటిగా విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది.
2012 నుంచి 2016 వరకు సక్సెస్‌ఫుల్‌గానే సాగిన ఈ భామ కెరీర్...2017 నుంచి ట్రాక్ తప్పింది. ఈ ఏడాదిలో మిస్టర్`, రాధ`, యుద్ధం శరణం`, ఉన్నది ఒకటే జిందగీ`, ప్రాజెక్ట్ z`.. ఇలా ఐదు వరుస పరాజయాలు దక్కాయి. కొత్త సంవత్సరంలో కూడా లావణ్యకి పరాజయాల పరంపర తప్పలేదు. ఈ శుక్రవారం విడుదలైన ఇంటిలిజెంట్` కూడా ఫ్లాప్ కావడంతో.. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది లావణ్య. మళ్ళీ ఈ హీరోయిన్ విజయాల బాట పడుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే.. ఈ ముద్దుగుమ్మ చేతిలో తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com