అమ్మాయిలను దేశం విడిచిపెట్టి వెళ్లమంటున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు కన్నడ సినీ రంగంలో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ప్రియమణి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వెలిబుచ్చింది. బెంగళూరులో పదిగంటలకు ఓ అమ్మాయిని దుండగుడు ఎత్తికెళ్లి అత్యాచారానికి ప్రయత్నించడం, కేరళలో జిషా అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేయడం గురించి తన భావాలను తెలియజేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటి పరిస్థితి..మహిళలు, అమ్మాయిలందరూ ఇండియాను వదిలి ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోండంటూ ట్వీట్ చేసింది. దీనిపై చాలా మంది ప్రియమణి వ్యతిరేకమైన కౌంటర్స్ కూడా ఇచ్చారు. ప్రియమణి వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. అయితే తానేం దేశాన్ని కించపరచలేదని, జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాన్ని చెప్పానని ప్రియమణి ట్వీట్ తోనే సమాధానమిచ్చింది. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com