పెళ్లికి రెడీ అవుతున్న హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లికి రెడీ అవుతున్న హీరోయిన్ ఎవరో కాదు...అందాల తార ప్రియమణి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రియమణి స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో చెప్పంది.
తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ ను ఓ డాన్స్ షోలో కలిసానని..ఆ పరిచయం కాస్త పరిణయానికి దారితీసిందని అంటోంది. ఈ ఏడాది చివరల్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రియమణి చెప్పింది. అలాగే మంచి కథతో ఎవరైనా సంప్రదిస్తే...పెళ్లి తర్వాత కూడా నటిస్తానంటుంది. ముస్తాఫా రాజ్ ముంబాయిలో ఓ ఈవెంట్ సంస్థలో వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout