Pooja Hegde:సోషల్ మీడియాలో పిచ్చి కూతలు .. అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడూ సైలెంట్‌గా, నవ్వుతూ, తన పని తాను చేసుకుపోయే హీరోయిన్ పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు పోస్టులు పెట్టాడని ఆరోపిస్తూ క్రిటిక్ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపారు. వీటిని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో చూపించారు. పూజా హెగ్డే చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయని.. ఆమె ఐరన్ లెగ్ అంటూ సంధు ట్వీట్ చేశాడు. ఈ పరిణామాలతో పూజ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యకు సైతం యత్నించిందంటూ సంధూ ట్వీట్లో పిచ్చి రాతలు రాశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూజా హెగ్డే టీమ్ స్పందించింది. అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే అతను ప్రస్తుతం లండన్‌లో వున్నందున తనను ఎవరూ ఏమి చేయలేరు అన్నట్లుగా ఆ నోటీసులను కూడా ట్వీట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నాడు.
రివ్యూలతో పాపులర్ అయిన సంధు:
కాగా.. దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని అంటూ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను రిలీజ్‌కు రివ్యూలు చెప్పడం ద్వారా ఉమైర్ సంధు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ఇతనికి యువతలో మంచి ఫాలోయింగ్ కూడా వుంది. అయితే ఈ పాపులారిటీని అతను దుర్వినియోగం చేస్తున్నాడు. రివ్యూల పేరుతో హీరో హీరోయిన్లపై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నాడు. వారి వ్యక్తిగత విషయాల గురించి లేనిపోనివి చెబుతూ వివాదాల్లో వేలుపెడుతూ ఆ దిశగా పాపులర్ అవుతున్నాడు ఉమైర్.
నటీనటులపై తప్పుడు వ్యాఖ్యలు :
గతంలో అక్కినేని అఖిల్.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను వేధించాడంటూ అప్పట్లో చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. అలాగే కృతి సనన్‌కు ప్రభాస్ ప్రపోజ్ చేశారని.. త్వరలోనే విషయం బయటకు వస్తుందంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఆదిపురుష్ సినిమా సమయంలో ఈ వార్త దుమారం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కృతి సనన్ కూడా సంధుకు లీగల్ నోటీస్ పంపిన సంగతి తెలిసిందే.
#PoojaHegde sent me Legal Notice 😄😄😄 !! Behjo Behjo Notices Flop Actresses. pic.twitter.com/lGneUBF1zw
— Umair Sandhu (@UmairSandu) July 25, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments