ధోనీ కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు హీరోయిన్ ప్లాన్!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. ధోనీ కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు స్టార్ హీరోయిన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా ప్లాన్ చేస్తోందట. స్వయంగా ఈ విషయం ఆమె ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
సరదాగా ట్వీట్ చేసిన ప్రీతి ఇలా చమత్కరించింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత చెన్నైపై పంజాబ్ విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రీతిజింటా ఓ ట్వీట్ చేసింది.
ప్రీతి ట్వీట్ సారాంశం ఇదీ..
"కెప్టెన్ కూల్ ధోనీకి నాలాగే చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే నా దృష్టి అంతా ఇప్పుడు ధోనీ కుమార్తె జీవాపై పడింది. ధోనీని జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. నేను జీవాను కిడ్నాప్ చేయొచ్చేమా..!." అని మిస్టర్ కూల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది ప్రీతి. అంతటితో ఆగని ఆమె ధోనీతో గ్రౌండ్లో కరచాలనం ఇస్తున్న ఓ ఫొటోను జతచేసి.. ఎమోజీ పెట్టి.. గాయ్స్ ఈ ఫొటోకు క్యాప్షన్ చెప్పండి అంటూ ట్వీట్ చేసింది. కొందరు ప్రీతి అభిమానులు అయ్యో.. జీవాను ఎందుకు మేడం కిడ్నాప్ చేసేది.. నన్ను కిడ్నాప్ చేస్కోండి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అభిమానులు నెక్స్ట్ మీ కింగ్స్ లెవన్ జట్టులోకి తీసుకోండి మేడం అంటూ ప్రీతి అభిమానులు సలహాలు ఇస్తున్నారు.
Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful - I may just kidnap her ?? Now it's time for you guys to Caption THIS photo...#Ting pic.twitter.com/bD1ADSXopc
— Preity G Zinta (@realpreityzinta) May 7, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments