'అర్జున్ రెడ్డి' నుండి తప్పుకున్న హీరోయిన్?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో గత ఏడాది ఘన విజయం సాధించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. కల్ట్ మూవీ అంటూ అందరితో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తమిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి. హింధీ విషయానికి షాహిద్ కపూర్ అర్జున్‌రెడ్డిగా నటిస్తున్నాడు. ఇతనికి జోడిగా తారా సుతైరాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ముందు ఒకే చెప్పింది.
ఈ సినిమాతో పాటు తారా కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో కూడా నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాల డేట్స్ క్లాష్ వస్తుండటంతో అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసింది. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ కాకుండా ఆలస్యం కావడంతో హీరోయిన్‌కు సమస్య వచ్చిందని.. అందుకనే తారా తప్పుకుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com