హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

  • IndiaGlitz, [Friday,May 21 2021]

హీరోయిన్ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా న్యూడ్ వీడియోల లీక్ ఘటన ఆమెకు ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టింది.

గతంలో పలు సందర్భాల్లో వాటి గురించి మాట్లాడడానికి నిరాకరించిన రాధిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. ఆ వీడియోల గురించి నోరు విప్పింది. లీకైన వీడియోలు, ఇమేజ్ లలో ఉన్నది తాను కాదని చెబుతోంది రాధికా ఆప్టే. పార్చెడ్, క్లీన్ షేవెన్ చిత్రాల నుంచి ఆ వీడియోలు అప్పట్లో ప్రచారం జరిగింది.

స్వయంగా రాధికా ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ వీడియో లీకైనప్పుడు నేను నాలుగురోజుల పాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. మీడియా వల్ల కాదు. నా చుట్టూ ఉన్నవారి వల్ల. చివరకు నా డ్రైవర్ కూడా ఆ ఇమేజెస్ చూసి నన్ను గుర్తు పట్టాడు. నా డ్రైవర్, వాచ్ మెన్, నా స్టైలిష్ డ్రైవర్ వీరంతా ఆ ఇమేజ్ లు చూసి నన్ను గుర్తుపట్టారు. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురైనట్లు రాధిక తెలిపింది.

విచక్షణ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని అని రాధికా చెప్పుకొచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మసక మసకగా ఉన్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. లీకైన వీడియోలలో ఉన్నది ఎవరనేది కూడా అనవసరం అని రాధికా ఆప్టే తెలిపింది.

ఇక పార్చెడ్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో అవకాశం నేను కోరుకున్నదే అని తెలిపింది. ఆ చిత్రం కోసం న్యూడ్ గా నటించింది నిజమే. అందుకు కారణం ఉంది. బాలీవుడ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పరంగా ఏమైనా చేయాలని నిరంతరం అడుగుతూనే ఉంటారు. కానీ నేను మాత్రం శరీరం, ముఖంతో ఏదో చేయాల్సిన అవసరం లేదని నమ్ముతాను అంటూ రాధికా వివరించింది.

More News

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఊహించని షాక్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తై..

వారెవా.. కిరాక్ అనిపించేలా అల్లు శిరీష్ న్యూలుక్ వైరల్

హీరో అల్లు శిరీష్ మంచి హిట్ కోసం చాలా కాలం నుంచి  ప్రయత్నిస్తున్నాడు. శిరీష్ కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. కిట్ ధర కూడా చాలా తక్కువే..

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రస్తుత తరుణంలో చాలా కష్టమైపోతుంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలంటే కోడి కంటే ముందే లేవాలి.

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్...13 మంది మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున

కృష్ణపట్నం కరోనా మందు.. అసలు కథ ఇదీ..

‘కృష్ణపట్నం కరోనా మందు..’ కొవిడ్‌ రోగుల పాలిట దివ్వఔషధం! ఇప్పటి వరకూ ఎలాంటి రిమార్క్ లేదు. మందు వాడిన వారంతా కరోనా నుంచి కోలుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..