పాస్ పోర్ట్ పారేసుకున్నహీరోయిన్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

బాలీవుడ్‌లో 'మున్నా మైకేల్‌'తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది నిధి అగ‌ర్వాల్‌. తెలుగులో 'స‌వ్య‌సాచి', 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు రామ్‌తో 'ఇస్మార్ట్ శంక‌ర్‌'లో జ‌త క‌ట్టింది. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లోనే 'ఇస్మార్ట్ శంక‌ర్' టాకీ పార్ట్ పూర్తి కానుంది. పాట చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యూర‌ప్ వెళ్లాల్సి ఉంది.

ఈ త‌రుణంలో నిధి అగ‌ర్వాల్ పాస్ పోర్ట్ క‌న‌ప‌డ‌లేదు. అయితే నిధి వెంట‌నే పోలీసుల‌కు కంప్లైంట్ చేసింది. కొత్త పాస్‌పోర్ట్‌కి అప్లై చేసింది. అధికారులు నిధి అగ‌ర్వాల్‌కు ఓ కొత్త పాస్‌పోర్ట్‌ను ఇష్యూ చేశారు. అయితే నిధి పాస్‌పోర్ట్ రాకుంటే మొత్తం షెడ్యూల్ పాడై ఉండేదికానీ దర్శ‌క నిర్మాత‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌నే ఆలోచ‌న‌తో నిధి అగ‌ర్వాల్ ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యింద‌ని స‌మాచారం.