అరగంటలో బుల్లెట్ నేర్చుకున్న హీరోయిన్!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ నటన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రీతూ జంటగా నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో నటించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత ఆశించినంతగా అవకాశాలు రాలేదు. అయితే సినిమా అంటే ఫ్యాషన్ కావడంతో కోలీవుడ్, మల్లూవుడ్ ఆఖరికి బాలీవుడ్లో కూడా నటించడానికి ప్రయత్నాలు చేసింది. అయితే.. ఇప్పుడిప్పుడే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయ్. తెలుగులో కూడా వరుస సినిమాలో బిజిబిజీగా గడపనుంది.
కొత్తగా ట్రై చేసిన డైరెక్టర్!
ఇక అసలు విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌గా ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాలోని ‘గుండెగిల్లి ప్రాణం తీయ్యెద్దే’ అనే పాటను విడుదల చేశారు. అభిమానుల మన్ననలను పొందిన ఈ సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇందులో రీతూ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తుంది. వాస్తవానికి స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ సీన్ లేదట. అయితే.. అలా సడన్‌గా డైరెక్టర్.. హీరోయిన్ చేత అలా బైక్ డ్రైవింగ్ అంటే కాస్త కొత్తగా అనిపిస్తుందని ట్రై చేశాడట.
అరగంటలో బుల్లెట్ నేర్చుకున్నా!
ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ప్రముఖ జాతీయ పత్రికతో రీతూ పంచుకుంది. ‘డైరెక్టర్ అలా చెప్పడంతో అప్పటికప్పుడు నేను బుల్లెట్ నడపడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాటలో ఒక మాంటేజ్ సీన్లో నేను బుల్లెట్ రైడ్ చేస్తే బావుంటుందని పదేపదే దర్శకుడు చెప్పారు. వాస్తవానికి నాకు సైక్లింగ్ తప్ప బండి రాదు. నన్ను నమ్మండి... ఫస్ట్ బుల్లెట్ రైడ్ చేయాలని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. నాకు బైక్ రైడ్ చేయడం రాదు.. కానీ, చిన్నప్పుడు సైకిల్ తొక్కడంతో ఎలాగోలా బైక్ బ్యాలన్స్ చేశాను. అది కూడా దుల్కర్ సల్మాన్ సహాయంతో అరగంటలో బుల్లెట్ నేర్చుకోవడం జరిగింది. వామ్మో.. ఆ బుల్లెట్ బండి మాత్రం చాలా బరువుగా ఉంది. నిజానికి.. గౌతమ్ సర్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక వింత యాదృచ్చికం’ అని రీతూ వెల్లడించింది. రొమాంటిక్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రం ఫిబ్రవరి- 28న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout