జర్నలిస్టుల కష్టాలు తెలుసుకున్నానంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

బాలీవుడ్ షాట్‌గ‌న్ శ‌తృఘ్న‌సిన్హా త‌న‌య సోనాక్షిసిన్హా త‌న త‌దుప‌రి సినిమా నూర్ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లోక‌న‌ప‌డుతుంది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సినిమా కోసం ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో సోనాక్షిసిన్హా బిజీ బిజీగా ఉంది.
ఈ సినిమా కోసం సోనాక్షి క్యారెక్ట‌ర్ ప‌రంగా ప‌డ్డ క‌ష్టంతో జ‌ర్న‌లిస్టుల క‌ష్ట‌మెంటో తెలిసొచ్చిందంటుంది. జ‌ర్న‌లిస్టుల క‌ష్టాలేంటో అవ‌గాహ‌న వ‌చ్చింది. జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పినా త‌క్కువే. ముఖ్య‌మైన స‌మాచారం కోసం ప‌రుగులు పెట్టాలి. అంద‌రితో మంచిగా మాట్లాడాలి. డెడ్‌లైన్స్ ఉంటాయి. ఇష్టం లేని ప‌నులున్నా, కొన్నిసార్లు ఉద్యోగ‌రీత్యా ప‌నిచేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది సోనాక్షి.