పవన్ మాటలు నాకు స్ఫూర్తి అంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాలకు, సినిమాలకు ఎప్పుడూ సంబంధం ఉంటూనే ఉంటుంది. అది ఇప్పుడు మరింత ఉధృతంగా మారింది. రాజకీయనాయకులు సినిమాల వేడుకలకు రావడం పరిపాటి. సినిమా కళాకారులు రాజకీయాల్లోకి వెళ్లడం కూడా అంతే సహజం. అయితే ఇటీవల సినిమా హీరో పవన్ కల్యాణ్, రాజకీయనేత జగన్ మధ్య జరిగిన వాగ్యుద్ధం... వారిద్దరి వ్యక్తిగత జీవితాలతో పాటు, వారితో పరిచయం ఉన్న పలువురిని ఇబ్బంది పెడుతున్నాయి. సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో ఇరువర్గాల వారి అభిమానులు అవతలివారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నామనుకుంటూ వారి సంబంధీకులను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
తాజాగా అలాంటి అనుభవం నటి అలేఖ్య ఏంజెల్‌కు ఎదురైంది. ఆమె తెలుగులో ఇంతకు ముందు `స్విస్ రాజా`, `మిస్టర్ మనీ` సినిమాల్లో నటించారు. `అక్కడొకడుంటాడు` ఆమెకు విడుదలకు రెడీగా ఉంది. గతంలో ఓ సారి ఆమె జగన్‌తో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ట్రోల్ చేయడం సబబు కాదని అలేఖ్య అభిప్రాయ పడ్డారు.
ఆమె మాట్లాడుతూ `` గతంలో వైసీపీ అధినేత జగన్ తో నేను కలిసి దిగిన సెల్ఫీపై అసత్య ప్రచారం జరుగుతోంది. జగన్ ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో నేను బలి అవుతున్నాను. ఈ చర్యలను ఖండిస్తున్నా. జగన్ నాకు తండ్రి, అన్నయ్యలతో సమానం. పవన్ పలికే మాటలు, ఆయన చెప్పే ధైర్య వచనాలు నాకెంతో స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. అందుకే ఇంత జరిగినా ఎంతో ధైర్యంగా ఉన్నా. దయచేసి... ట్రోలింగ్ ఫొటోలను తీసేయాల్సిందిగా అభిమానులను అభ్యర్థిస్తున్నా. మన ఇంటి ఆడపిల్లకు ఈ రకమైన అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా?`` అని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments