హీరోయిన్ భర్తకు బెదిరింపులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఆయేషా టాకీయా. సినిమా రంగంలో హీరోయిన్‌గా కొనసాగుతుండగానే పర్హాన్ అజ్మీని పెళ్ళి చేసేసుకుని సెటిలైపోయింది. అయితే పర్హాన్ ముస్లిం కావడంతో అసలు సమస్య వచ్చింది. హిందూ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారంటూ బెదిరింపు కాల్ వచ్చినట్టు సమాచారం. దీంతో పర్హాన్ జూలై 26న పోలీసులకు పిర్యాదు చేశారు.
పర్హాన్; ఆయేషాకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ ఇంటిని, ఆఫీస్, కార్లను బాంబులతో లేపేస్తామని బెదిరిస్తున్నారని పిర్యాదు పెర్కొన్నట్లు సమాచారం. మీ నాన్నని పూరికే నోరు పారేసుకోవద్దని చెప్పు, లేకుంటే ఆయన్ను కూడా లేపేస్తామని బెదిరించారట. పర్హాన్ అజ్మీ తండ్రి సమాజ్ వాది పార్టీకి చెందిన నేత అబు అజ్మీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com