రెడ్ లైట్ ఏరియాకు వెళ్లిన హీరోయిన్...!
Send us your feedback to audioarticles@vaarta.com
ముంబైలో రెడ్‌లైట్ ఏరియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కడ కామాటిపుర ఏరియా వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్. సెక్స్ వర్కర్స్ ఎంతో మంది అక్కడుంటారు. అయితే వీరందరూ లాక్‌డౌన్ సమయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు మధుర్ బండార్కర్ ‘ఇండియా లాక్‌డౌన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకంతో పరిచయమై కొన్ని తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతాబసు ప్రసాద్ మెహర్ ఉన్నిసా పాత్రలో నటిస్తుంది.
ఆ పాత్రలో నటించడానికి శ్వేతా బసు ప్రసాద్ పెద్ద పని చేశానని చెబుతుంది. అదేంటో తెలుసా..? పాత్రలో ఒదిగిపోవడానికి అసలు సెక్స్ వర్కర్స్ లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడెలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు? అనే విషయాలను తెలుసుకోవడానికి డైరెక్టర్ మధుర్ బండార్కర్ సహా టీమ్‌తో కలిసి కామాటిపుర ప్రాంతాన్ని సందర్శించిందట. అక్కడ సెక్స్ వర్కర్స్ ఎలాంటి భాషను వాడుతారు?పరిస్థితులేంటివి? అనే విషయాల గురించి శ్వేతాబసు ప్రసాద్ అవగాహన చేసుకుందట.
ఆ మధ్య హైదరాబాద్‌లో వ్యభిచారం కేసులో దొరికిన శ్వేతాబసు ప్రసాద్, ఆ కేసులో నిర్దోషిగా బయటపడింది. తర్వాత రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి సవ్యంగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్, సినిమాల్లో బిజీగా కావడానికి తన వంతు ప్రయత్నాలను చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com