పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
లీడర్, మిరపకాయ్, భాయ్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు అమెరికాలో చదువుకుంటుంది. ఈ అమ్మడు ఉన్నట్లుండి సినిమాలకు బ్రేక్ చెప్పేసి, చదువులో నిమగ్నమైంది.
రిచా తన క్లోజ్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిచా అదే సోషల్ మీడియా ద్వారా ఆ వార్తలను ఖండించారు. తనకు పెళ్లి కాలేదని, ఇప్పట్లో ఆ ఆలోచన లేదని తెలియజేశారు.
అలాగే తను వేరే రంగాన్ని ఎంచుకున్నానని, ఇలాంటి వదంతులను సృష్టించవద్దని తెలిపారు. తన పెళ్లి విషయాన్ని తనే తెలియజేస్తానని కూడా తెలియజేసింది రిచా గంగోపాధ్యాయ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments