ఎన్టీఆర్, కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్...కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.
ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను ఫైనల్ చేసారట. శ్రుతి హాసన్ కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమాలో నటించింది. ఎన్టీఆర్ తో కలసి రామయ్యా వస్తావయ్యా సినిమాలో నటించింది. శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ పాత్రని సరికొత్తగా డిజైన్ చేసిన కొరటాల ఈసారి హీరోయిన్ పాత్రను ఎలా చూపించనున్నాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com