బన్ని హీరోయిన్ ఫిక్సయ్యింది...

  • IndiaGlitz, [Monday,November 21 2016]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేళ్‌రాజా నిర్మిస్తారు. అల్లు అర్జున్ నటించబోతున్న తొలి తమిళ చిత్రమిదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి నెలాఖరులో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ల అన్వేషణలో దర్శకుడు లింగుస్వామి వున్నారని, యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. అల్లుఅర్జున్ తాజా చిత్రం డీజే-దువ్వాడ జగన్నాథం చిత్రీకరణ పూర్తయిన వెంటనే లింగుస్వామి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌...

More News

చరణ్ సిక్స్ ప్యాక్....

బన్ని,ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఇలా యంగ్ జనరేషన్ హీరోలందరూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు.

సూర్య సింగం 3 ఆడియో రిలీజ్ డేట్..!

సూర్య హీరోగా న‌టిస్తున్న‌తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే క్రేజ్ ఏర్ప‌డింది.

సీనియ‌ర్ న‌రేష్ కొత్త అవ‌తారం..!

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవ‌ల దృశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను శైల‌జ‌, అఆ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

'2.0' లో యాక్ట్ చేయడం వల్ల ఓపిక పెరిగింది: అక్షయ్ కుమార్

స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను నెగటివ్ హీరోను చేసేశాడు.

'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో