బన్ని హీరోయిన్ ఫిక్సయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేళ్‌రాజా నిర్మిస్తారు. అల్లు అర్జున్ నటించబోతున్న తొలి తమిళ చిత్రమిదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి నెలాఖరులో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ల అన్వేషణలో దర్శకుడు లింగుస్వామి వున్నారని, యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. అల్లుఅర్జున్ తాజా చిత్రం డీజే-దువ్వాడ జగన్నాథం చిత్రీకరణ పూర్తయిన వెంటనే లింగుస్వామి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com