ఫస్ట్ మూవీ నుంచే నో అంటున్న హీరోయిన్..

  • IndiaGlitz, [Thursday,March 10 2016]
నారా రోహిత్ - ల‌తా హేగ్డే జంట‌గా కుమార్ నాగేంద్ర తెర‌కెక్కించిన చిత్రం తుంట‌రి. ఈ చిత్రాన్నిశ్రీ కీర్తి ఫిల్మ్ బ్యాన‌ర్ పై అశోక్, నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా ....
తుంట‌రి హీరోయిన్ ల‌తా హేగ్డే మాట్లాడుతూ...మాది క‌ర్నాట‌క‌. కానీ న్యూజిలాండ్ లో పెరిగాను. చిన్న‌ప్ప‌టి నుంచి ఏక్టింగ్ అంటే ఇష్టం. మోడ‌లింగ్ కూడా చేసాను. అనుకోకుండా ఈ సినిమాలో నటించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు సిరి. మ‌న ప‌క్కంటి అమ్మాయిలా చాలా సింపుల్ గా ఉంటుంది. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాకు తెలుగు రాక‌పోవ‌డం వ‌ల‌న కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యాను. అయితే హీరో రోహిత్ లాంగ్వేజ్ గురించి చెబుతూ చాలా హెల్ప్ చేసాడు. అలాగే డైరెక్ట‌ర్ కుమార్ నాగేంద్ర కూడా సీన్ గురించి బాగా ఎక్స్ ప్లైన్ చేసేవారు. అలా చెప్ప‌డం వ‌ల‌న న‌టించేట‌ప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించేది.
మోడ‌లింగ్ చేసినప్ప‌టికీ..సినిమాల్లోనే లైఫ్ ఉంటుంది అందుచేత సినిమాల‌కే నా ప్రాధాన్య‌త. ఈ సినిమాలో నాపాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌లేదు. కానీ..ఫ్యూచ‌ర్ లో తెలుగు నేర్చుకుని ఖ‌చ్చితంగా నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెబుతాను. గ్లామ‌ర్ - ఫ‌ర్ ఫార్మెన్స్ ఈ రెండింటిలో దేనికి మీ ప్రాధాన్య‌త అంటే ప‌ర్ ఫార్మెన్స్ రోల్స్ కే అని చెబుతాను. స్కిన్ షో చేయ‌డం నాకు ఇష్టం లేదు అని అంటోంది. మ‌రి...ఫ‌స్ట్ మూవీ నుంచే షో కి నో అంటుంది. ఇదే మాట మీద నిల‌బ‌డుతుందో..లేదో..?