వెంకీ జోడీ కుదిరిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
గురు తరువాత సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్.. తన తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్నారు. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ఇటీవలే తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు వెంకీ. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైదరీ కథానాయికగా ఎంపికైందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వేసవిలో విడుదలైన తమిళ అనువాద చిత్రం చెలియాతో అదితి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
మెహరీన్, అనుష్క, కాజల్, తమన్నా.. ఇలా కొంతమంది ప్రముఖ కథానాయికల పేర్లు ఈ సినిమా విషయంలో వినిపించాయి. ఆఖరికి ఆ అవకాశం అదితికి దక్కడం ఆమె అదృష్టమనే చెప్పాలి.
ఆటా నాదే వేటా నాదే అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి సందడి చేయనుంది. కేవలం 60 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని తేజ ప్లాన్ చేశారని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com