అఫీషియల్ : రాంచరణ్, శంకర్ మూవీ హీరోయిన్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా అగ్ర దర్శకులలో ఒకరైన శంకర్ కాంబోలో చిత్రం రోజు రోజుకూ భారీతనం సంతరించుకుంటోంది. ఈ కాంబినేషన్ కి ప్రకటన వచ్చినప్పుడే అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్.. చుట్టూ వాలిపోయిన ఉద్యోగులు!
తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు పరిశీలిస్తున్నారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ చిత్రంలో కియారా నటించబోతోంది అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది.
నేడు కియారా పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనితో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
రాంచరణ్ తో కియారా జోడి కట్టడం ఇది రెండవసారి. వీరిద్దరూ ఇప్పటికే బోయపాటి 'వినయ విధేయ రామ చిత్రంలో కలసి నటించారు. ఆ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
ఇక శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన మెసేజ్, పొలిటికల్ అంశాలు, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించబోతున్నట్లు టాక్.ఈ మేరకు శంకర్ సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. చిత్ర యూనిట్ చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లనుంది. అక్కడ ప్రధాన తారాగణంపై రాజమౌళి భారీ సాంగ్ చిత్రీకరించబోతున్న సంగతి తెలిసిందే.
Joining us on this super exciting journey is the talented and gorgeous @advani_kiara !
— Sri Venkateswara Creations (@SVC_official) July 31, 2021
Welcome on board ❤️#HappyBirthdayKiaraAdvani#RC15 #SVC50@ShankarShanmugh @AlwaysRamCharan @MusicThaman @SVC_official pic.twitter.com/u4RU0Fs2ee
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com