శంకర్ సినిమాలో రామ్ చరణ్‌కు హీరోయిన్ సిద్ధం!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వెళుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ తదుపరి చిత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న చెర్రీకి ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో చెర్రీ నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమా ప్రకటనకు సంబంధించి న్యూస్ వచ్చిన నాటి నుంచే మెగాభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నట్టు సమాచారం. కియార ఓ రిపోర్టర్ పాత్రలో కనిపించనుందని టాక్. ఇప్పటికే కియారా.. చెర్రీతో కలిసి ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల వైపు తిరిగి చూడలేదు. తిరిగి చెర్రీతోనే కలిసి నటించేందుకు కియారా సిద్ధమవుతోందని సమాచారం. అంతకు ముందు కియారా.. ‘భరత్ అనే నేను’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం శంకర్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి శంకర్, కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది అయితే వివిధ కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది నిలిచిపోయింది. కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈలోగా శంకర్.. చెర్రీతో చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవగానే చెర్రీ కూడా శంకర్‌తో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments