మందు తాగి రచ్చ చేసిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
బుజ్జిగాడు మేడిన్ చెన్నై సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న హీరోయిన్ సంజనా గర్లాని బెంగళూరులోని పబ్‌లో మద్యం తాగి రచ్చ రచ్చ చేసింది. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ పోలీసులకు సంజనా గర్లాని తనపై మద్యం బాటిల్, గ్లాస్ తీసుకుని దాడి చేసిందని ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసులు తెలిపారు.
బెంగళూరు కబ్బన్ పార్క్ పరిధిలో కూంఝీ బార్లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పార్టీకి సంజనా సైతం హాజరయ్యారు.
ఒకే టేబుల్‌పై కూర్చున్న వందనా జైన్, సంజనా గర్లాని మద్యం సేవించారు. ఇద్దరి మాటలు మధ్య స్టార్ట్ అయిన గొడవ మాటా మాట పెరిగి పెద్దదైందట. అక్కడున్న మిగతావారు ఇద్దరికీ నచ్చచెప్పారట. అయితే వందనా జైన్ నేరుగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంజనా తనపై దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదు చేశారు. అయితే వందనా తనను దూషించడంతో పాటు తన చేయిని మెలిపెట్టిందని, దాంతో తాను వందనా జైన్ మీద చేయి చేసుకోవాల్సి వచ్చిందని సంజనా చెబుతుందట. మరీ గొడవ సర్దుబాటు అవుతుందో కాదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments