విజయ్ దేవరకొండ ముందే ‘అర్జున్ రెడ్డి’ సినిమాను విమర్శించిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మన గురించో, మనకు ఇష్టమైన వారి గురించి వేరే వాళ్లు విమర్శిస్తే మనకెంతో బాధగా ఉంటుంది. మనం అక్కడ నుండి పక్కకు వెళ్లిపోతాం లేదా తిరిగి మనం ఏదో ఒకటి అంటాం. ఇప్పుడు విజయ్ దేవరకొండకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. డిస్కషన్ సందర్భంగా హీరో విజయ్‌దేవరకొండ, మలయాళీ హీరోయిన్ పార్వతీ మీనన్ కలుసుకున్నారు.
ముందు పార్వతీ మీనన్ మాట్లాడుతూ “సాధారణంగా ఓ ట్రాజెడీ సినిమాను చూసి కాసేపు బాధపడి మరచిపోతాం. కానీ అర్జున్‌రెడ్డి వంటి సినిమాలో హీరో అమ్మాయిని కొడతాడు. ఆ సినిమాను చూసి అబ్బాయిలు చేసిన కామెంట్స్ చూశాను... షాకయ్యాను. యూత్‌పై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి సినిమాలకు, హీరోలకు నేను దూరంగా ఉంటాను” అన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ స్పందిస్తూ “ఓ సినిమా కారణంగా ఓ వ్యక్తి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకూడదు. వ్యక్తిత్వాని కుటుంబం, వాతావరణం, స్కూల్, స్నేహితులు ఇలా విషయాలు ప్రభావితం చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి నేను పార్వతి లాజిక్‌తో ఏకీభవిస్తాను. సమాజానికి చెడు కలిగించే కాన్సెప్ట్ సినిమాలకు దూరంగా ఉంటాను” అన్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చాలా పెద్ద విజయాన్ని సాధించింది. హిందీలో రీమేక్ అయ్యి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తమిళంలోనూ రీమేకై మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. సినిమా సక్సెస్‌తో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అయితే హీరోయిన్ విజయ్ దేవరకొండను నేరుగా విమర్శించడం ఇదే తొలిసారి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments