సుమంత్ కి హీరోయిన్ సెట్ అయ్యింది.
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అంటే అక్కినేని కాంపౌండ్ యార్లగడ్డ సుమంత్ కాదు..ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్. ఇటీవల సుమంత్ కొలంబస్ సినిమాతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో విజయం సాధించిన ఆర్డినరీ చిత్రాన్ని తెలుగులో రైట్ రైట్ టైటిల్ తో సుమంత్ అశ్విన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మను తెరకెక్కించనున్నారు.
శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వంశీ క్రిష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుమంత్ అశ్విన్ సరసన హీరోయిన్ గా పూజ ఝవేరిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. పూజ ఝవేరి గత సంవత్సరం రిలీజైన భం భం భోలేనాథ్ మూవీలో నటించింది. ప్రస్తుతం తమిళ్ లో థనుష్ సరసన ఓ మూవీలో నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో బాహుబలి కాళికేయ ముఖ్యపాత్రను పోషిస్తుండడం విశేషం. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 7 నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com