బాలయ్య హీరోయిన్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ చిత్రంలో ఆయన సరసన నటించబోయే హీరోయిన్ ఖరారైంది. అఖిల్ చిత్రంతో తెలుగులో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సయేషా సైగల్ బాలకృష్ణ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ప్రకటనను వెలువరిచింది.సయేషా సైగల్ కూడా బాలకృష్ణతో కలిసి సినిమా చేయడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అఖిల్ సినిమా తర్వాత సయేషా తెలుగులో చేస్తున్న రెండో చిత్రమిది. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. తమిళ హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా సయేషా హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సయేషాకు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొదనున్న మూడో చిత్రంలో అవకాశం వచ్చింది.
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ షూటింగ్ రీసెంట్‌గానే రీస్టార్ట్ అయ్యింది. ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చే్స్తాడని అందులో ఓ హీరోయిన్గా సయేషా ఖరారైంది. మరో హీరోయిన్గా పూర్ణ నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com