తాను ప్రేమలో ఉన్నానంటున్న హీరోయిన్....
- IndiaGlitz, [Tuesday,June 06 2017]
సాధారణంగా హీరోయిన్స్ రూమర్స్ గురించి పట్టించుకోకుండా, అసలు విషయం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటారు. తాను మాత్రం అందుకు విరుద్ధం అంటుంది హీరోయిన్ రష్మిక మందన్న. కిరిక్ పార్టీ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్నప్రముఖ నటుడు, దర్వకుడు అయిన రక్షిత్ శెట్టితో ఈ నటి ప్రేమలో ఉందని చాలా రోజులుగా వార్తలు వినపడుతూ వచ్చాయి.
అయితే ఈ వార్తలకు బ్రేక్ చెబుతూ రష్మిక తాను, రక్షిత్ ప్రేమించుకుంటున్నామని, తర్వలోనే ఒకటి కానున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. కిరిక్ పార్టీ సక్సెస్‌తో తెలుగులో నాగశౌర్యతో ఓ సినిమా, రామ్‌తో ఓసినిమా చేస్తుంది.