కిస్ సీన్ లో నటిస్తే అలాగే ఫీల్ కావాలి.. హీరోయిన్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు అదృష్టం కలసి రాలేదు. పరిణీతి చోప్రా కెరీర్ లో ఎక్కువగా పరాజయాలే ఎదురయ్యాయి. కానీ తన హార్డ్ వర్క్ తో పరిణీతి బాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా ఇప్పటికీ కొనసాగుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రా కిస్సింగ్, రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా పరిణీతి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
తాము సినిమా కథలో భాగంగా నటిస్తున్నాం అంతే. రొమాంటిక్, కిస్ సన్నివేశాలకు తాను ఇలాగే ప్రిపేర్ అయి వెళతానని పరిణీతి తెలిపింది. కిస్సింగ్ సీన్ చేస్తున్నప్పుడు తమ మధ్య ఎలాంటి ఫిలింగ్ ఉండదు. అది సినిమా, మేము చేస్తున్నది నటన అనే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. దర్శకుడు కట్ చెబితే కట్ అంతే. దాని గురించి ఇలా ఆలోచించము. అలాంటి సన్నివేశాల్లో సాంకేతికత కూడా ఎక్కువగా ఉంటుంది.. అంటే ఆ సీన్ పండడం కెమెరా వర్క్ తదితర అంశాలు ఆధారపడి ఉంటాయి. అంతే కానీ నటీనటుల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని పరిణీతి చెప్పుకొచ్చింది.
ఇక కొన్ని చిత్రాలకు సైన్ చేసి చివరి నిమిషంలో నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సంఘటన కూడా తన కెరీర్ లో జరిగింది అని పరిణీతి తెలిపింది. నిర్మాత, సినిమా పేరు చెప్పను. ఓ చిత్రానికి సైన్ చేశాను. చివరి నిమిషంలో కథపై నాకు నమ్మకం కుదర్లేదు. అందుకే నిర్మాతకు డబ్బు తిరిగి ఇచ్చేసి పక్కకు తప్పుకున్నానని పరిణీతి తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com