న్యూడ్ సీన్ కి రెడీ.. బోల్డ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్!
Send us your feedback to audioarticles@vaarta.com
నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది.
కాగా మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న పిశాసు 2 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పిశాసు (తెలుగులో పిశాచి) తమిళంలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో పిశాసు 2పై అంచనాలు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మరలా షూట్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. ఆండ్రియా ఈ చిత్రంలో నగ్నంగా నటించేందుకు రెడీ అయిపోయిందట. కథ డిమాండ్ చేయడంతో ఆండ్రియా న్యూడ్ సీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథలో ఆ సన్నివేశం చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది.
న్యూడ్ సీన్ లో నటించాల్సి ఉండడంతో ఆండ్రియా తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. ఈ అప్డేట్ తో ఈ చిత్రంపై ఉత్కంఠ పెరిగింది. రెండేళ్ల క్రితం అమలాపాల్ కూడా 'ఆమె' అనే చిత్రంలో న్యూడ్ సీన్ లో నటించింది. అమలాపాల్ బోల్డ్ అటెంప్ట్ కు ప్రశంసలు దక్కాయి. మరి ఆండ్రియా పిశాసు 2 లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఆండ్రియా ప్రస్తుతం తమిళంలో అరడజను పైగా చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో ఆండ్రియా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆండ్రియా తడాఖా చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments