కన్యత్యం పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
- IndiaGlitz, [Wednesday,January 02 2019]
అమ్మాయి కన్యత్వంపై బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్ అయ్యాయి. పెళ్లి అయ్యేంత వరకు కన్యగా ఉండి, భర్తకు మాత్రమే గిఫ్ట్‌గా ఇవ్వడానికి కన్యత్వం ఏమీ గిఫ్ట్ కాదని కల్కి కొచ్లిన్ అంది. పెళ్లయ్యే వరకు సెక్స్‌కు దూరంగా ఉండాలని అనుకోవడం ఏంటంటూ ప్రశ్నించింది.
అది అమ్మాయిల వ్యక్తిగత విషయం. సెక్స్ విషయంలో నో చెప్పే హక్కు ఎంత ఉంటుందో.. ఎస్ చెప్పేంత హక్కు కూడా అంతే ఉంటుందంటూ కొచ్లిన్ చెప్పింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఫ్రెంచ్ దేశానికి చెందిన కల్కికొచ్లిన్ కామెంట్స్ ఆశ్చర్యకరంగానే అనిపిస్తాయి.