పవన్ ఫ్యాన్ గా కనపడుతున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ టైటిల్ పాత్రలో రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా `గురు`. సుధా కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిందీ, తమిళంలో రూపొందిన సాలా ఖద్దూస్ సినిమాకు ఈ సినిమా రీమేక్. వెంకటేష్ ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా కనపడుతున్నాడు. ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో రితిక సింగ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా కనపడుతుందట. మాతృకలో ధనుష్ ఫ్యాన్‌గా కనపడే రితిక సింగ్ తెలుగులో మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా కనపడనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయలని నిర్మాతలు అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com