హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది..
Send us your feedback to audioarticles@vaarta.com
‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది. గతంలో అనిత తల్లికాబోతోందంటూ ఎన్నో సార్లు వార్తలొచ్చాయి. కానీ అనిత వాటన్నింటినీ కొట్టిపడేశారు. తాజాగా అనిత ఓ వీడియో ద్వారా తాను తల్లి కాబోతోన్న విషయాన్ని వెల్లడించారు. పారిశ్రామికవేత్త రోహిత్‌ను ప్రేమంచిన అనిత.. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి విషయాలతో పాటు తను తల్లి కాబోతున్న విషయాలను ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
అనిత తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అనిత, రోహిత్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం తాళ్ ద్వారా అనిత వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ‘నువ్వు నేను’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అలాగే అనిత వెండితెరపైనే కాకుండా బుల్లితెర ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments