హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది..

  • IndiaGlitz, [Sunday,October 11 2020]

‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత తల్లి కాబోతోంది. గతంలో అనిత తల్లికాబోతోందంటూ ఎన్నో సార్లు వార్తలొచ్చాయి. కానీ అనిత వాటన్నింటినీ కొట్టిపడేశారు. తాజాగా అనిత ఓ వీడియో ద్వారా తాను తల్లి కాబోతోన్న విషయాన్ని వెల్లడించారు. పారిశ్రామికవేత్త రోహిత్‌ను ప్రేమంచిన అనిత.. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి విషయాలతో పాటు తను తల్లి కాబోతున్న విషయాలను ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

అనిత తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అనిత, రోహిత్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం తాళ్ ద్వారా అనిత వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె ‘నువ్వు నేను’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అలాగే అనిత వెండితెరపైనే కాకుండా బుల్లితెర ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు.

More News

ఫ్రస్టేషన్.. చిరాకు, కోపం వచ్చేవి: రాశి ఖన్నా

సక్సెస్‌తో సంబంధం లేకుండా రాణించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది రాశీఖన్నాయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు.

సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు.

'ఒరేయ్ బుజ్జిగా..'మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది - యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం