విజయ్‌దేవరకొండ సినిమా గురించి హీరోయిన్ ఏమందంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్‌దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మాతగా ఓ సినిమా రీసెంట్గా ప్రారంభమైంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇషా బెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇషా బెల్లా విషయానికి వస్తే.. ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రెండు హిందీ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా ఇదే. ఈ బ్రెజిల్ సుందరాంగి.. ఏడేళ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం కొనసాగిస్తుంది.
``కొన్ని కమర్షియల్ యాడ్స్ సందర్బంగా సిటీకి వస్తూ పోతున్నాను. కాబట్టి హైదరాబాద్‌ను నా సెకండ్ హోం అనుకుంటున్నాను. క్రాంతి మాధవ్ ఈ స్క్రిప్ట్ చెప్పగానే ఇదే దక్షిణాదిన నటిగాఎంట్రీ ఇవ్వడానికి సరైన స్క్రిప్ట్ అనిపించి ఒప్పుకున్నాను. వర్క్ షాప్‌లో పాల్గొనబోతున్నాను. తెలుగు కష్టమే అని తెలుసు. అయితే టీమ్ సపోర్ట్‌తో దాన్ని అధిగమిస్తాను`` అంటుందీ ఇషా బెల్లా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com