సమాజమే అంతేనంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Monday,December 26 2016]

అమ‌లాపాల్‌...ఈ మ‌ల‌యాళీ హీరోయిన్ కెరీర్ మంచి ఊపులో ఉన్న‌ప్పుడే ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌లు రేగ‌డం ఇద్ద‌రూ విడిపోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు అమ‌లా పాల్ త‌న సినిమాల‌తో బిజీగా ఉంటూ వ‌స్తుంది. అయితే విడాకులు త‌ర్వాత హీరో ధ‌నుష్‌తో అమ‌ల క్లోజ్‌గా ఉంటుంద‌ని కోలీవుడ్‌లో వార్తలు వ‌చ్చాయి. దీనిపై అమ‌లా ఘాట‌గానే స్పందించింది. ఏమీ తెలియ‌కుండానే ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య లింక్‌లెలా పెట్టేస్తారు.

ధ‌నుష్ నాకు ఎప్పుడూ మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే వ్య‌క్తి ధ‌నుష్‌. అలాంటి వ్య‌క్తి గురించి ఇలాంటి వార్త‌లు రావ‌డం భ‌రించ‌లేక‌పోతున్నాను. అయితే ఇలాంటి వార్త‌లకు కాలం చెల్ల‌వు. అయినా ఇలాంటి వార్త‌లు నేను అమ్మాయి కావ‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయి. ఎందుకంటే ఓ రిలేష‌న్‌షిప్ ఫెయిలైతే అంద‌రూ అమ్మాయినే నిందిస్తారు..మ‌న స‌మాజ‌మే అంతేనంటూ వాపోయింది...