పెళ్లి గురించి హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో హలోతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కల్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కల్యాణి ప్రియదర్శన్‌కు కాస్త నిరాశ కలిగినా శర్వానంద్, సుధీర్ వర్మ చిత్రం దళపతి(వినపడుతున్న టైటిల్)తో పాటు సాయితేజ్‌తో చిత్రలహరి సినిమాలో నటించింది. హలో నిరాశ పరిచినా.. రీసెంట్గా విడుదలైన చిత్రలహరితో సక్సెస్‌ను చూసింది కల్యాణి.
దర్శకత్వ శాఖలో పనిచేసి హీరోయిన్గా మారిన కల్యాణి.. హీరోయిన్ కావడానికి చాలా కష్టాలే పడిందట. బొద్దుగా ఉండే కల్యాణి దాదాపు పాతిక కిలోల బరువు తగ్గిందట. నటనపై, గ్లామర్‌పై దృష్టి పెట్టి తర్వాతే హీరోయిన్గా పరిచయమైందట. సాధారణంగా హీరోయిన్గామారిన తను కెరీర్‌పై కాన్సన్ట్రేషన్తోనే ఉన్నా కూడా.. మూడేళ్లలో తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని సెటిలైపోతుందట. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లందరికీ తెలుసునని.. కాబట్టి ఇంటి నుండి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాకపోవచ్చు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం చెప్పను అంటూ అందరినీ సస్పెన్స్‌లోకి నెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments