చిన్నారుల కోసం హీరో భార్య చేయూత‌

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

సినీ సెల‌బ్రిటీలు కేవ‌లం సినిమాల్లో వినోదాన్ని పంచ‌డానికే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా బిజీగా మారిపోతున్నారు. క‌ష్టాల్లోని వారిని చూసి వారికి సహాయం చేయ‌డానికి త‌మ‌కు తాముగా ముందుకు వ‌స్తున్నారు. అందులోభాగంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌ను సేవాకార్య‌క్ర‌మాల‌కు అంద‌ర‌జేస్తున్నారు.

తాజాగా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ భార్య‌, ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి ఇలాంటి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్న‌పిల్ల‌ల కోసం అక్టోబ‌ర్ 15న చెన్నైలో ఓ లైవ్ క‌న్‌స‌ర్ట్‌ను కండెక్ట్ చేస్తుంది. ఈ లైవ్ షోకు రావాల‌నుకునేవారు రూపాయ‌లు వెయ్యి నుండి ప‌దివేల వ‌ర‌కు వెచ్చించి టికెట్‌ను కొనుక్కోవాలి. చిన్న పిల్ల‌ల కోసం చిన్మ‌యి చేస్తున్న ఈ ఈవెంట్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం.