పెళ్లి మాట వింటే భయపడుతున్న హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లి మాట వింటే చాలు...ఆ హీరో భయపడుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరో కాదు..యువ హీరో నాగ శౌర్య. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగ శౌర్య కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు. రంజిత్ మూవీస్ బ్యానర్ లో రూపొందించిన కళ్యాణ వైభోగమే సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...కళ్యాణ వైభోగమే ఆడియో ఫంక్షన్ లో డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ...నాగ శౌర్యకి ఓ కల వచ్చిందని నాకు చెప్పాడు. అదేమిటంటే...నాగ శౌర్య పెళ్లి జరుగుతుందట. ఆ పెళ్లికి నేను వెళ్లి నాగ శౌర్య ని ఆశీర్వదించానట. త్వరలోనే ఇది నిజం అవుతుదేమో...చూసుకోండి అంటూ నాగ శౌర్య ఫేరెంట్స్ కి నవ్వుతూ.. చిన్న సలహా ఇచ్చేసారు. నందినీ రెడ్డి మాటలకు స్టేజ్ పై నుంచే హీరో నాగ శౌర్య స్పందిస్తూ....అమ్మా...నువ్వు ఏమీ కంగారు పడకు. నీకు తెలియకుండా కోడలు రాదు అని చెప్పాడు.
నాగ శౌర్య నందినీ రెడ్డి మాటలకు వెంటనే రియాక్ట్ అవ్వడానికి కారణం ఏమిటంటే... నాగ శౌర్య, రాశీ ఖన్నా ఇద్దరు ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు చూసి నాగ శౌర్య అమ్మ కంగారుపడ్డారట. అప్పటి నుంచి రాశీ ఖన్నతో ప్రేమ వ్యవహారం గురించి నాగ శౌర్యను ఎప్పుడు అడిగినా...అవన్నీ రూమర్స్ మాత్రమే అంటున్నాడు. అలాంటిది ఇప్పుడు నందినీ రెడ్డి నాగ శౌర్య పెళ్లి..కల అంటూ చెప్పడంతో అమ్మ మళ్లీ ఎక్కడ కంగారు పడుతుందో అనే అనుమానంతో వెంటనే రియాక్ట్ అయి..కోడలు నీకు తెలియకుండా రాదమ్మా అంటూ అమ్మకి మాటిచ్చాడు నాగ శౌర్య అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments